సోమవారం 01 జూన్ 2020
International - May 08, 2020 , 07:01:59

ఇరాన్‌లో భూకంపం... ఒకరు మృతి

ఇరాన్‌లో భూకంపం... ఒకరు మృతి

టెహ్రాన్‌ : ఇరాన్‌లో గడిచిన రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. భూకంప ధాటికి ఒకరు మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కైనూష్‌ జహన్‌పూర్‌ భూకంపం విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఈ ఉదయం వెల్లడించారు. యూనైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపిన వివరాల ప్రకారం రాజధాని నగరం టెహ్రాన్‌కు ఈశాన్యంగా ఉన్న దమవంద్‌లో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.logo