సోమవారం 08 మార్చి 2021
International - Jan 26, 2021 , 16:56:28

భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు

భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు

లండన్‌ : భూగోళాన్ని ఆవరించిన మంచు రికార్డు వేగంతో కరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం 1994-2017 మధ్య భూమిపై మంచు 28 ట్రిలియన్‌ టన్నులు కరిగిపోయినట్లుగా సమాచారం. క్రియోస్పీయర్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గత మూడు దశాబ్దాల్లో మంచు కరగడం వేగంగా పెరిగింది. 1990ల్లో ఏడాదికి 0.8 ట్రిలియన్‌ టన్నులు మంచు కరిగి కనుమరుగైతే అదే 2017 నాటికి ఇది ఏడాది 1.3 ట్రిలియన్‌ టన్నులుగా ఉంది. యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ బృందం ప్రపంచవ్యాప్తంగా మంచు కరగడంపై శాలిలైట్‌ డేటా ఆధారంగా నివేదిక రూపొందించింది. వాతావరణ మార్పుల వల్ల 68 శాతం, సముద్ర ద్రవీభవనం వల్ల మిగతా 32 శాతం మంచును కోల్పోతున్నట్లు తెలిపింది. ఈ స్థాయిలో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, సముద్రతీర ప్రాంతాలు వరద ప్రభావానికి గురైతున్నట్లు వెల్లడించారు. దీనిపై ఆధారపడ్డ వన్యప్రాణులు అంతరించిపోతున్నట్లు చెప్పారు. భూమిపై విస్తరించి ఉన్న 2,15,000 పర్వత హిమానీనదాలు, గ్రీన్‌లాండ్‌, అంటార్కిటాకాలోని ధ్రువ మంచు పలకలపై ఈ అధ్యయనం కొనసాగింది.

VIDEOS

logo