సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 15:56:55

ముందు జాగ్ర‌త్తే.. 3 కోట్ల మందిని కాపాడుతుంది

ముందు జాగ్ర‌త్తే.. 3 కోట్ల మందిని కాపాడుతుంది

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ‌దేశాలు క‌ఠిన చ‌ర్య‌లు అమలు చేస్తే క‌నీసం మూడు కోట్ల మందిని ర‌క్షించుకునే అవ‌కాశం ఉంద‌ని లండ‌న్‌కు చెందిన ఇంపీరియ‌ల్ కాలేజీ ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.  ప్ర‌పంచ‌దేశాలు ఏమీ చేయ‌లేని ప‌క్షంలో.. ఈ ఏడాదే సుమారు 4 కోట్ల మంది మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంద‌ని ఆ ప‌రిశోధ‌కులు హెచ్చ‌రించారు.  అయితే సామాజిక దూరం పాటించ‌డం వల్ల క‌నీసం మ‌ర‌ణాల సంఖ్య‌ను స‌గానికి త‌గ్గించ‌వ‌చ్చు అని తెలిపారు. వీలైనంత త్వ‌ర‌గా ఆయా దేశాలు మ‌రిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తే కోట్లాది మందికి మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.  ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం,  కేసుల‌ను ఐసోలేట్ చేయ‌డం, సామాజిక దూరాన్ని పాటించ‌డం వ‌ల్ల వైర‌స్ సంక్ర‌మ‌ణ అరిక‌ట్ట‌వ‌చ్చు అన్నారు. వైర‌స్ ప్ర‌బ‌ల‌డం వ‌ల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.  మ‌హ‌మ్మారి వ‌ల్ల మొత్తం 202 దేశాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో వారు అధ్య‌య‌నం చేశారు. చైనా డేటాతో పోలుస్తూ వారు ఈ అంచ‌నా వేశారు.logo