సోమవారం 01 జూన్ 2020
International - Apr 14, 2020 , 07:52:56

బాతు ఎలా ప్రాణాలు కాపాడుకుందో చూడండి ..వీడియో

బాతు ఎలా ప్రాణాలు కాపాడుకుందో చూడండి ..వీడియో

ఓ బాతు చాలా చాక‌చ‌క్యంగా త‌న ప్రాణాలు కాపాడుకున్న వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కుక్క త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించిన బాతు ఒక్క‌సారిగా క‌ళ్లు తేలేసింది. కాళ్లు స‌మాంత‌రంగా చాపి చ‌నిపోయిన‌ట్లుగా న‌టించింది. కుక్క ఆ బాతును చూసి చ‌నిపోయింద‌నుకుని, కొద్దిగా ప‌క్క‌కు వెళ్ల‌గానే చ‌టుక్కున అక్క‌డి నుంచి పారిపోయింది బాతు. 

స‌మ‌య‌స్ఫూర్తితో బాతు త‌న‌ను తాను కాపాడుకున్న వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో గ‌తంలోనే ఆన్ లైన్ లో చ‌క్కర్లు కొట్ట‌గా..తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఈ వీడియోకు 9 వేల‌కుపైగా వ్యూస్ రావ‌డంతోపాటు వేల సంఖ్య‌లో కామెంట్లు వచ్చాయి. బాతు అవార్డు ఇచ్చేంత ప్ర‌ద‌ర్శ‌న చేసిందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

logo