గురువారం 28 మే 2020
International - May 12, 2020 , 21:46:35

విరాళం పెట్టెగా మారిన బుర్జ్‌ ఖలీఫా

విరాళం పెట్టెగా మారిన బుర్జ్‌ ఖలీఫా

దుబాయ్‌: ప్రపంచంలోనే ఎత్తైన భవనం అయిన బుర్జ్‌ ఖలీఫా స్వచ్ఛంద విరాళం పెట్టెగా మారిపోయింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నివాసితుల కోసం  ఆహారం సమకూర్చేందుకు విరాళాలు సేకరిస్తున్నట్టు బుర్జ్‌ ఖలీఫా యాజమాన్యం తెలిపింది. ఇందులో భాగంగా ఈ భవంతికి ఏర్పాటుచేసిన మిరుమిట్లు గొలిపే లైట్లను అమ్మేందుకు సిద్ధపడ్డారు. ప్రతి టవర్‌ యొక్క 10.2 లక్షల లైట్లను 10 దిర్హామ్‌ చొప్పున విక్రయించనున్నారు. ఈ మొత్తం  ఒక వ్యక్తికి ఒక పూట భోజనానికి సరిపోతుంది. విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ఒక్కో లైట్‌ విలువ కూడా పెరిగిపోతున్నది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దుబాయ్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో వలసకార్మికులు స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కొవిడ్‌-19 కారణంగా యూఏఈలో 19,661 కేసులు నమోదవగా, 203 మంది చనిపోయారు. కరోనా బాధితులకు చేపట్టిన వినూత్న లైట్ల విక్రయం ద్వారా ఇప్పటివరకు 1.2 మిలియన్లకు పైగా భోజనాలకు సరిపడే విరాళాలు అందాయి.


logo