శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 27, 2020 , 15:00:22

14 కోట్ల ఖ‌రీదైన వాచీలు చోరీ.. భార‌తీయుడికి జైలు

14 కోట్ల ఖ‌రీదైన వాచీలు చోరీ.. భార‌తీయుడికి జైలు

హైద‌రాబాద్‌:  దుబాయ్‌లో ప‌నిచేస్తున్న ఓ భార‌తీయ వ్య‌క్తికి ఏడాది జైలు శిక్ష ఖ‌రారైంది. అత‌ను సుమారు 14 కోట్ల ఖ‌రీదైన 86 వాచీల‌ను దొంగ‌త‌నం చేశాడు.  ఓ వాచీ షాపులో క్లీన‌ర్‌గా ప‌నిచేస్తున్న అత‌ను మ‌రో ఇద్ద‌రితో క‌లిసి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు.  ఏడాది జైలు శిక్ష త‌ర్వాత ముగ్గుర్నీ దేశం నుంచి వెలివేయ‌నున్నారు. నైయిఫ్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ ఏడాది జ‌న‌వ‌రి 6వ తేదీన వీరిపై ఫిర్యాదు న‌మోదు చేశారు. షాపుల్లోంచి తీసిన వాచీలోను డ‌స్ట్‌బిన్‌లో వేసి, ఆ త‌ర్వాత వాటిని అక్క‌డ నుంచి ఎత్తుకువెళ్లేవాడు అని విచార‌ణ‌లో తేలింది.  


logo