ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 20:21:39

ప‌క్షి గుడ్ల‌ను పొదిగే విధానం క్లియ‌ర్ వీడియో.. ఏకంగా ప్రిన్స్‌ కారునే గూడుగా మార్చేసుకున్న‌ది!

ప‌క్షి గుడ్ల‌ను పొదిగే విధానం క్లియ‌ర్ వీడియో.. ఏకంగా ప్రిన్స్‌ కారునే గూడుగా మార్చేసుకున్న‌ది!

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హ‌మ్దాన్ బిన్ మోహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తూమ్ త‌న ఎస్‌యూవీ కారుని వాడ‌డానికి నిరాక‌రించారు. దానికి కార‌ణం ఒక పావురం. ప్రిన్స్‌ను 'ఫాజ్జా' అని కూడా అంటారు. పావురం గూడు క‌ట్టుకోవ‌డానికి త‌న మెర్సిడెస్ ఎస్‌యూవీ కారును ఎప్పుడైతే ఉప‌యోగించాయో అప్ప‌టి నుంచి కారును వాడ‌లేదు.  అంతేకాదు దానికి రెడ్ క‌ల‌ర్ టేపుని కూడా అంటించాడు.

పావురం పెట్టిన గుడ్ల‌ను పొదిగేందుకు కారు మీద గూడును ఏర్పాటు చేసుకున్న‌ది. గుడ్డు నుంచి పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి పావురం చేసిన ప‌నిని వీడియోలో క్యాప్చ‌ర్ చేశారు. మొత్తం గుడ్ల‌ను చిన్న‌గా ముక్కుతో ప‌గ‌ల‌కొట్టి బ‌య‌ట‌కు తీసింది. ఇదంతా వీడియోలో క్లియ‌ర్‌గా చూపించారు. కొన్నిసార్లు జీవితంలో చిన్న విష‌యాలు కూడా ఎక్కువే' అన్న శీర్షిక‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఇంత అంద‌మైన వీడియోను పోస్ట్ చేసినందుకు నెటిజ‌న్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

   


logo