గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 15:27:33

దుబాయ్ లో మ‌ద్యం డోర్ డెలివ‌రీ..!

దుబాయ్ లో మ‌ద్యం డోర్ డెలివ‌రీ..!

మ‌ద్యం అమ్మ‌కాలతో జ‌రిగే ప‌న్ను చెల్లింపుల ద్వారా వ‌చ్చే ఆదాయం చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చాలా ప్రాంతాల మాదిరిగానే ఇస్లామిక్ స్టేట్ సిటీ దుబాయ్ లో కూడా ఆల్కాహాల్ అమ్మ‌కాల‌, ట్యాక్స్‌ల చెల్లింపుల‌తో వ‌చ్చే ఆదాయం ఆర్థికంగా భ‌రోసానివ్వ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

అయితే లాక్ డౌన్ తో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితమ‌వ‌డం, మ‌ద్యం షాపులు, బార్లు అన్ని మూసివేయ‌డంతో ఆదాయం త‌గ్గిపోయింది. దీంతో దుబాయ్ ప్ర‌భుత్వం మ‌ద్యం డోర్ డెలివ‌రీకి అనుమ‌తి ఇచ్చింది. దుబాయ్ లో మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్టే రెండు ప్ర‌ధాన కంపెనీలు..ఆదాయానికి గండిప‌డ‌కుండా డోర్ డెలివ‌రీని చేప‌డుతున్నాయి. బీర్లు, స్పిరిట్‌, వైన్ ను రెండు కంపెనీలు ఇంటివ‌ద్ద‌కే చేరుస్తున్నాయి. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo