157 సార్లకు పాసయ్యాడు.. దేనిలోనంటే..!

కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే.. లెర్నర్స్ పరీక్షకు హాజరై.. అధికారులు ఇచ్చే ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలివ్వాలి. లెర్నర్ లైసెన్స్ వచ్చిన నెల రోజుల తర్వాత వాహనాన్ని నడిపి చూపించాలి. అప్పుడే మనకు లైసెన్స్ వస్తుంది. లెర్నర్ పరీక్ష ఆన్లైన్లో ఉండి కొద్దిగా చదువుకున్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో అక్కడున్న సిబ్బందిని మచ్చిక చేసుకుంటే వారు మనకు సహాయపడి మనం పాసయ్యేలా చేస్తంటారు. ఇందుకు తక్కువల తక్కువ రూ.వేయి ఖర్చవుతుంది.
అదేలండన్లో అయితే కథ మరోలా ఉంటుంది. ఓ పెద్దాయన లెర్నర్ లైసెన్స్ కోసం ఏకంగా 156 సార్లు విఫలయత్నం చేశాడంట. తుదకు 157 వ సారి విజయవంతంగా పాసై లెర్నర్ లైసెన్స్ పొందాడంట. ఇందుకోసం అతగాడు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాడంట. ఏమయితేనేం.. పట్టు వదలని విక్రమార్కుడిలా వెంటపడి మరీ పాసయ్యాడంట. ఓ 30 ఏండ్ల మహిళ 117 సార్లు లెర్నర్ పరీక్ష హాజరవగా.. ఓ 48 ఏండ్ల పెద్దావిడ తన 94 వ ప్రయత్నంలో విజయం సాధించినట్లు డ్రైవింగ్ అండ్ వెహికిల్ స్టాండర్డ్స్ ఏజెన్సీ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్