బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 06, 2020 , 15:29:17

లైసెన్స్‌ పొందిన 10 నిమిషాలకే కారు నదిలోకి

లైసెన్స్‌ పొందిన 10 నిమిషాలకే కారు నదిలోకి

బీజింగ్‌ :  డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసైన ఆనందంలోంచి బయటకు రాకముందే ఓ వ్యక్తి ప్రమాదం భారిన పడ్డాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జాంగ్‌ అనే వ్యక్తి డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరయ్యాడు. డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసై లైసెన్స్‌ తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పి నేరుగా నదిలోకే కారును పోనిచ్చాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. లైసెన్స్‌ పొందినందుకు వస్తున్న అభినందనల టెక్ట్స్‌ మేసేజ్‌లకు అతడు ఫోన్‌లో తిరిగి స్పందిస్తుండగా ప్రమాదం భారిన పడ్డాడు. జున్యి ట్రాఫిక్‌ పోలీసులు ఈ యాక్సిడెంట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ కారు యజమాని 10 నిమిషాల క్రితమే లైసెన్స్‌ పొందినట్లుగా పేర్కొన్నారు. కారులో వెళ్తూ ఫోన్‌లో మేసేజ్‌లను చూస్తున్నాను. బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులు కారుకు ముందుగా వచ్చారు. దీంతో భయాందోళనకు గురై ఒక్కసారిగా ఎడమవైపు తిప్పడంతో నదిలో పడ్డా. కారు డోర్‌ను తన్ని తప్పించుకున్నట్లు సదరు కారు యజమాని పేర్కొన్నాడు. క్రేన్‌ సహాయంతో నదిలోని కారును బయటకు తీశారు.logo
>>>>>>