మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:26

టిఫిన్‌కు ముందే కాఫీతో చేటు మధుమేహం వచ్చే అవకాశం

టిఫిన్‌కు ముందే కాఫీతో చేటు మధుమేహం వచ్చే అవకాశం

లండన్‌, అక్టోబర్‌ 2: ఉదయాన్నే లేచి వేడివేడి కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే టిఫిన్‌ (బ్రేక్‌ఫాస్ట్‌) చేయకుండానే కాఫీ తాగడం వల్ల మధుమేహం (డయాబెటిస్‌) వచ్చే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది. ఉదయాన్నే లేచి కాఫీ తాగడం వల్ల తొలుత బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌పై ప్రభావం పడుతుందని, అది ముదిరి మధుమేహం, గుండె జబ్బులకు దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలు ‘బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌'లో ప్రచురితమయ్యాయి.


logo