ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 16:29:08

వన్యమృగాలనుంచి ఆవులను ఇలా రక్షించొచ్చు..!

వన్యమృగాలనుంచి ఆవులను ఇలా రక్షించొచ్చు..!

కాన్‌బెర్రా: అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులకు తమ ఆవులను వన్యమృగాలనుంచి రక్షించుకోవడం నిత్యం సవాల్‌తో కూడుకున్నది.  వీరికి ఆవులు, ఇతర పశువుల భద్రత ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. అన్ని భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, పశువులకు అడవి జంతువులనుంచి ముప్పు పొంచి ఉంటుంది. అయితే, దీనికి ఆస్ట్రేలియా పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. పెయింట్‌, పెయింట్‌ బ్రష్‌తోకూడిన ఓ సరళమైన ఆలోచనను అనుసరించడం ద్వారా వన్యమృగాలను భయపెట్టవచ్చని తేల్చారు. 

ఆవుల వెనుక భాగాన కళ్లను గీస్తే అడవి జంతువులు భయపడిపోతాయని అధ్యయనం చెబుతోంది. ఆస్ట్రేలియా దేశంలోని న్యూసౌత్‌ వేల్స్‌కు చెందిన పరిశోధకుల బృందం ఉత్తర బోస్ట్వానాలోని 14 వేర్వేరు మందల మీద అధ్యయనం చేసింది. అధ్యయనం సమయంలో, ఆవులను మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఆవుల వెనుక భాగంలో కళ్లను చిత్రీకరించారు. వేరే గ్రూపుపై మామూలు గీతలు గీశారు. మరో గ్రూపును అలాగే వదిలేశారు. అధ్యయనం ముగిసే సరికి కళ్లు చిత్రీకరించిన ఆవుల జోలికి వన్యమృగాలు పోలేదని నిర్ధారించారు. ఆవుల వెనుకభాగాన చిత్రీకరించిన కళ్లను చూసి వన్యమృగాలు కన్ఫ్యూస్‌ అవుతున్నాయని, ఆవులు నిజంగానే చూస్తున్నాయనుకొని వాటి జోలికి వెళ్లడం లేదని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.  


logo