గురువారం 28 మే 2020
International - Apr 02, 2020 , 01:36:15

కరోనా హీరో జెలెంకో

కరోనా హీరో జెలెంకో

699 మందికి చికిత్స.. అందరికీ స్వస్థత

న్యూయార్క్‌: డాక్టర్‌ వ్లాదిమిర్‌ జెలెంకో.. కరోనా బాధితుల పాలిట హీరో అయ్యారు. న్యూయార్క్‌లో వైరస్‌ సోకిన 699 మందికి చికిత్స అందించి స్వస్థత చేకూర్చారు. ‘శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితో నా వద్దకు వచ్చిన వారికి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ సల్ఫేట్‌, జింక్‌, అజిత్రోమైసిన్‌ (జెడ్‌-పాక్‌) మందులతో చికిత్స అందించి కేవలం నాలుగు నుంచి ఆరు వారాల్లోనే కోలుకునేట్లు చేయగలిగాను. నేను చికిత్స అందించిన పేషెంట్లలో ఎవరూ చనిపోలేదు. ఎవరినీ వెంటిలేషన్‌లో పెట్టలేదు’ అని జెలెంకో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చిన్నారుల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ సమస్యను తగ్గించడంలో జింక్‌ సప్లిమెంట్‌ ఎంతో ఉపయోగకారిణిగా ఉన్నదని అమెరికా మేరీల్యాండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌  తేల్చింది.logo