బుధవారం 27 మే 2020
International - Apr 16, 2020 , 12:31:05

హాస్పిట‌ల్ టీంతో డాక్ట‌ర్ జాస‌న్ ఫ‌న్నీ డ్యాన్స్‌..వీడియో

హాస్పిట‌ల్ టీంతో డాక్ట‌ర్ జాస‌న్ ఫ‌న్నీ డ్యాన్స్‌..వీడియో

డాక్ట‌ర్ జాస‌న్ క్యాంప్ బెల్ పోర్టులాండ్ లోని ఒరెగా న్ హెల్త్ అండ్ సైన్స్ యూనివ‌ర్సిటీ రెసిడెంట్ ఫిజిషియ‌న్‌. ఇపుడు ఆ డాక్ట‌ర్ సోష‌ల్ మీడియా స్టార్ గా  మారాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌న్నీ క‌రోనా ధాటికి వ‌ణికిపోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇంట్లో ఉండి...ఆరోగ్యంగా ఉండండి.  సామాజిక దూరాన్ని పాటిస్తే స‌రిపోతుంద‌ని సూచిస్తున్నాడు. ఆస్ప‌త్రిలో ఛ‌-ఛ స్లైడ్ సాంగ్ కు జాస‌న్ క్యాంప్ బెల్ త‌న స‌హోద్యోగుల‌తో క‌లిసి ఫ‌న్నీ స్టెప్పులేస్తూ అంద‌రిలో జోష్ నింపుతున్నాడు.

ఇటీవ‌ల పోస్ట్ చేసిన ఈ టిక్ టాక్ వీడియోకు 2.3మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. కొన్ని సార్లు స‌మ‌యం చాలా క్లిష్ట‌మైంది. మేం దానికి తేలిక‌గా తీసుకోం. భ‌విష్య‌త్ లో ఏమొచ్చినా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నామ‌ని అంద‌రిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతున్నాడు డాక్ట‌ర్ జాస‌న్‌.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo