శనివారం 06 జూన్ 2020
International - Apr 10, 2020 , 11:22:42

న్యూయార్క్‌లో అనాథ శ‌వాల‌ను ఖ‌న‌నం చేస్తున్న‌ది ఇక్క‌డే..

న్యూయార్క్‌లో అనాథ శ‌వాల‌ను ఖ‌న‌నం చేస్తున్న‌ది ఇక్క‌డే..

హైద‌రాబాద్‌: న్యూయార్క్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిని హ‌ర్ట్ ఐలాండ్‌లో ఖ‌న‌నం చేస్తున్నారు.  మృతిచెందిన వారికి బంధువులు లేకున్నా, లేక శ‌వాల‌ను ఖ‌న‌నం చేసే స్తోమ‌త లేకున్నా.. అలాంటి మృత‌దేహాల‌ను సాధార‌ణంగా హ‌ర్ట్ ఐలాండ్‌కు త‌ర‌లిస్తుంటారు. తూర్పు బ్రాంక్స్ స‌మీపంలో ఈ చిన్న దీవి ఉన్న‌ది. 1800 సంవ‌త్స‌రం నుంచి ఈ దీవిని ఖ‌న‌నాల కోస‌మే వాడుతున్నారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం కోవిడ్‌19 వ‌ల్ల‌  న్యూయార్క్‌లో సుమారు 5000 మందికిపైగా చ‌నిపోయారు.  

రెండు వారాల నుంచి కూడా సొంతం చేసుకునేందుకు రానటువంటి శ‌వాల‌ను హాస్ప‌ట‌ల్లో ఉన్న‌ట్లు న్యూయార్క్ మేయ‌ర్ ప్రెస్ సెక్ర‌ట‌రీ ఫ్రెడ్డీ గోల్డ్‌స్టీన్ తెలిపారు. ఒక‌వేళ మార్చ‌రీ అధికారుల‌తో ఎవ‌రైనా త‌మ బంధువుల స‌మాచారాన్ని చేర‌వేస్తే, అలాంటి మృతదేహాల‌ను దాచిపెడుతున్నామ‌ని ఆ అధికారి తెలిపారు.  అనాథ శ‌వాల‌ను మాత్రం తామే హ‌ర్ట్ ఐలాండ్‌లో ఖ‌న‌నం చేస్తున్న‌ట్లు చెప్పారు. 

మృత‌దేహాల‌ను మోసుకువెళ్లి ఖ‌న‌నం చేసేందుకు ప‌నివారు దొర‌క‌డం లేదు. దీంతో కొన్ని జైళ్ల నుంచి ఖైదీల‌ను ఇలాంటి ప‌నుల‌కు వాడుకుంటున్నారు.  వారికి స్వ‌ల్పంగా కొంత అమౌంట్ ఇస్తున్నారు. హ‌ర్ట్ ఐలాండ్‌లో ప్ర‌స్తుతం రోజుకు 25 మందిని స‌మాధి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారానికి అయిదు రోజుల పాటు హాస్ప‌త్రి వ‌ర్గాలు ఈ ప‌నిలో నిమగ్న‌మై ఉంటున్నాయి. రిఫ్రిజిరేటెడ్ ట్ర‌క్కుల్లో మృత‌దేహాల‌ను దీవికి త‌ర‌లిస్తున్నారు. 

logo