సోమవారం 01 జూన్ 2020
International - May 12, 2020 , 16:48:23

అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. అనేకమంది మృతి

అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. అనేకమంది మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో డజన్ల కొద్దీ మరణించారని అధికారులు తెలిపారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పోలీసు అధికారి అంత్యక్రియలు జరుగుతుండగా దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. సుమారు 40 మంది చనిపోవడమో, గాయపడడమో జరిగిందని ప్రాథమిక సమాచారం అందిందని అధికారులు చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ దళాలు ఆధిపత్యం కోసం తలపడుతుంటాయి. ఇస్లామిక్ స్టేట్ బలగాలను అంతర్జాతీయ దళాలు, తాలిబన్లు కలిసి ప్రావిన్స్ నుంచి తరిమికొట్టారు. కానీ ఐఎస్ అప్పుడప్పుడూ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటుంది. మంగళవారం నాటి దాడి ఐఎస్ పనే అయ్యుంటుందని అనుమానిస్తున్నారు.


logo