గురువారం 26 నవంబర్ 2020
International - Nov 20, 2020 , 12:12:07

బుకర్‌ ప్రైజ్ గెలుచుకున్న డ‌గ్ల‌స్ స్టువార్ట్‌

బుకర్‌ ప్రైజ్ గెలుచుకున్న డ‌గ్ల‌స్ స్టువార్ట్‌

హైద‌రాబాద్‌: స్కాట్‌లాండ్‌-అమెరికా ర‌చ‌యిత డ‌గ్ల‌స్ స్టువార్ట్‌ ఈ యేటి బుకర్‌ ప్రైజ్ గెలుచుకున్నారు.  డ‌గ్ల‌స్ రాసిన ష‌గ్గి బెయిన్ అనే న‌వ‌ల‌కు ఈ అవార్డు ద‌క్కింది.  గ్లాస్‌గోవ్‌లో పేదరికంలో పెరిగిన ర‌చయిత డ‌గ్ల‌స్ త‌న జీవిత విశేషాల‌ను ఆ న‌వ‌ల‌లో వివ‌రించారు.  వ్య‌స‌నాల నుంచి త‌న త‌ల్లి ఎలా ఇబ్బంది ప‌డిందో కూడా ఆ న‌వ‌ల‌లో ఆయ‌న రాశారు. 44 ఏళ్ల స్టువార్ట్ త‌న‌ను తాను వ‌ర్కింగ్ క్లాస్ కిడ్ అని చెప్పుకున్నారు.  స్కాట్‌లాండ్‌కు చెందిన ర‌చ‌యిత బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకోవ‌డం ఇది రెండ‌వ‌సారి.  1994లో స్కాటిష్ ర‌చ‌యిత జేమ్స్ కెల్మ‌న్ బుకర్‌ గెలుచుకున్నారు.  ష‌గ్గి బెయిన్ న‌వ‌ల‌లో మ‌ద్యానికి బానిసైన త‌న త‌ల్లి గురించి ర‌చ‌యిత డ‌గ్ల‌స్ రాశాడు. బుకర్‌ ప్రైజ్ విజేత‌కు 50వేల పౌండ్లు ఇవ్వ‌నున్నారు.