శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 10:36:20

2021లోనే క‌రోనా వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్ఓ

2021లోనే క‌రోనా వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా వైర‌స్‌ను నియంత్రించ‌డానికి వ్యాక్సిన్ల‌ను అభివృద్ధిచేయ‌డంలో ప‌రిశోధ‌కులు మంచి పురోగ‌తి సాధిస్తున్నార‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమ‌ర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్‌ మైక్ రయాన్ అన్నారు. అయితే వ్యాక్సిన్లు వచ్చేడాది ఆరంభంలోనే అందుబాటులోకి వ‌చ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీలో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయ‌ని వెల్ల‌డించారు. 

ఇప్పటికే అనేక టీకాలు క్లీనికల్ ట్రయల్స్‌లోని మూడో దశకు చేరుకున్నాయని తెలిపారు. కాగా, రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం, భద్రత విషయంలో ఇప్పటివరరకూ ప్రతికూల ఫలితాలు రాలేదన్నారు. వాస్తవదృష్టితో చూస్తే 2021 ప్రథ‌మార్థంలో గానీ టీకా మ‌న‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని పేర్కాన్నారు. అప్పటివరకు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ సామాజిక వ్యాప్తి అదుపులోకి వ‌చ్చేవ‌ర‌కు పాఠ‌శాలు తిరిగి తెర‌వ‌డంపై ప్ర‌భుత్వాలు ని‌ర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు. logo