మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 18:27:31

HCQపై పుకార్ల‌ను న‌మ్మొద్దు: బ‌్రెజిల్ అధ్య‌క్షుడు

HCQపై పుకార్ల‌ను న‌మ్మొద్దు: బ‌్రెజిల్ అధ్య‌క్షుడు

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ (HCQ) వాడ‌కంపై అనేక రకాల పుకార్లు చక్కెర్లు కొడుతున్నాయి. క‌రోనా విస్త‌రిస్తున్న తొలి రోజుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనాకు స‌రైన ఔష‌ధం అంటూ.. భార‌త్ నుంచి అనేక దేశాలు ఆ ఔష‌ధాన్ని కొనుగోలు చేశాయి. ఆ త‌ర్వాత క‌రోనా ట్రీట్‌మెంట్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంత ఎఫెక్టివ్ మెడిసిన్ ఏమీ కాద‌ని పుకార్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప‌నితీరుపై అనుమానం వ్య‌క్తం చేసింది. 

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కరోనా వైర‌స్‌తో ఇబ్బందిపడుతున్న బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సోనారో తాను హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు వాడుతున్నానని చెప్పారు. డాక్టర్లు హైడ్రాక్సీక్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ మందులు ఇస్తున్నార‌ని, వాటిని వాడిన తర్వాత‌ తన ఆరోగ్యం కదుటపడిందని, మానసికంగా కూడా ధైర్యంగా ఉన్నానని బోల్సోనారో అన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకంపై వస్తున్న వదంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo