బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 11:52:13

డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరుడి కన్నుమూత

డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరుడి కన్నుమూత

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్ శనివారం న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 72 ఏండ్ల రాబర్ట్‌ ట్రంప్‌ అనారోగ్యంతో బాధపడుతుతూ జూన్‌లో మన్హటన్‌లోని న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన మృతికిగల కారణాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు. శుక్రవారానికి ముందు న్యూజెర్సీకి వెళ్ళిన ట్రంప్‌ తన సోదరుడిని పరామర్శించేందుకు న్యూయార్క్ వెళ్లాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. 1948లో జన్మించిన రాబర్ట్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు. ప్రస్తుతం ఆయన ట్రంప్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

ఆ సంస్థ అట్లాంటిక్ సిటీ కాసినోలను సైతం ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన తన మాజీ కార్యదర్శి ఆన్ మేరీ పల్లన్‌ను వివాహం చేసుకున్నాడు. గతంలో బ్లెయిన్ అనే మహిళలను వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్‌లోని మిల్‌బ్రూక్‌లో ఆయన నివాసముంటున్నాడు. 2016లో రాబర్ట్ ట్రంప్ తన సోదరుడితోపాటు రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు. రాబర్ట్‌ మృతికి బరువైక్కిన హృదయంతో ట్రంప్‌ సంతాపం తెలిపారు. 'నా అద్భుత సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్. శాంతితో విశ్రాంతి తీసుకో' అని అమెరికా అధ్యక్షుడు ప్రకటనలో పేర్కొన్నారు.logo