సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 12:07:56

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మారిన ట్రంప్ మైనపు బొమ్మ

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మారిన ట్రంప్ మైనపు బొమ్మ

లండన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా ప్రకటిస్తున్న సమయంలో.. డొనాల్డ్ ట్రంప్ వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో గోల్ఫ్ ఆడుతున్నాడు. జో బైడెన్‌ను విజేతగా ప్రకటించిన సమయంలో ఫొటోగ్రాఫర్లు అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలను తీయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ట్రంప్‌ స్టెర్లింగ్ గోల్ఫ్ కోర్సులో తెల్లటి మాగా ధరించి గోల్ఫ్‌ ఆడుతుండగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఆ ఫొటోలు వైరల్‌ కావడంతో లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం నిర్వాహకులు తమ మనసు మార్చుకుని ట్రంప్‌ మైనపు విగ్రహంలో మార్పులు చేశారు. ఎర్రటి టై కట్టుకుని బ్లూ కలర్‌ బ్లేజర్‌లో అధ్యక్షుడిలా కనిపించాల్సిన ట్రంప్‌ను సాధారణ వస్త్రధారణ గోల్ఫింగ్ దుస్తులతో మార్చాలని నిర్ణయించారు. దాంతో మ్యూజియం మైనపు విగ్రహం నుంచి నీలిరంగు సూట్‌ను తీసివేసి, దాని స్థానంలో మావ్-కలర్ టాప్, చెక్ చేసిన గోల్ఫింగ్ ప్యాంటు, గోల్ఫ్ షూస్, మాగా టోపీతో ట్రంప్‌ విగ్రహం రూపురేఖలను మార్చేశారు.

"‌ డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పుడు తన అభిమాన క్రీడకు ఎక్కువ సమయం కేటాయించటానికి  మేడమ్‌ టుస్సాడ్‌ లండన్‌ తన వార్డ్‌రోబ్‌ను ప్రతిబింబించేలా గోల్ఫింగ్ దుస్తులలో ట్రంప్‌ బొమ్మను మార్చివేసింది" అని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రాసింది. ఈ విగ్రహం యొక్క చిత్రానికి 5,000 మంది లైక్‌లు రాగా.. పెద్ద సంఖ్యలో కామెంట్స్‌ వచ్చాయి. కొంతమంది నెటిజెన్స్‌ ట్రంప్‌ కొత్త వేషధారణ గురించి వ్రాయగా.. చాలా మంది ఈ విగ్రహం ట్రంప్‌ను పోలి ఉండటానికి మరికొన్ని పౌండ్లను జోడించాల్సిన అవసరం ఉన్నదని వ్యంగ్యంగా కామెంట్లు రాశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.