శనివారం 30 మే 2020
International - Apr 13, 2020 , 14:47:46

డోనాల్డ్ ట్రంప్ స్నేహితుడు క‌రోనాతో మృతి

డోనాల్డ్ ట్రంప్ స్నేహితుడు క‌రోనాతో మృతి

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా.. క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో క‌న్నుమూశారు. న్యూయార్క్ సిటీ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్‌గా ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది.  ట్రంప్‌కు చెందిన రిప‌బ్లిక‌న్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు.  క్రౌన్ అక్విజిష‌న్స్ పేరుతో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. న్యూయార్క్ న‌గ‌రంలో అనేక భారీ భ‌వంతుల‌ను వీరు నిర్మించారు. సెయింట్ రీజిస్ న్యూయార్క్‌, కార్టియ‌ర్ మ్యాన్‌స‌న్ లాంటి బ‌హుళ అంత‌స్తుల‌ను స్టాన్లీ నిర్మించారు.  డోనాల్డ్ ట్రంప్ ప్ర‌చారం కోసం స్టాన్లీ సుమారు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు విరాళం ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్న‌ర్‌తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గ‌త ఏడాది న్యూయార్క్‌లో జ‌రిగిన వెట‌రన్స్ డే ప‌రేడ్‌లోనూ స్టాన్లీని త‌న ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ ప‌రిచ‌యం చేశారు. 



logo