మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 04, 2020 , 15:39:05

'వాల్ ఆఫ్ లైస్‌'పై ట్రంప్‌ 20 వేల అబద్ధాలు

'వాల్ ఆఫ్ లైస్‌'పై ట్రంప్‌ 20 వేల అబద్ధాలు

మన్‌హట్టన్‌ : అబద్ధాల గోడ.. వినడానికి గమ్మత్తుగా ఉంది కదూ! అమెరికా ప్రజలు తమ నాయకుడు ప్రజలను మోసం చేయడానికి ఎలాంటి అబద్ధాలు అడుతున్నాడో చెప్పేందుకు మాన్‌హట్టన్‌లోని సోహోలో ఏర్పాటు చేశారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ..! అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అబద్ధాలతో హడలగొడ్తున్నాడంటూ ప్రజలు వాపోతున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ వాల్‌ ఆఫ్‌ లైస్‌.

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలను నమ్మించేందుకు చెప్పిన అబద్ధాలను న్యూయార్క్‌ సమీపంలోని సోహోలో ఏర్పాటుచేసిన డిజిటలైజ్డ్‌ గోడపై ప్రజలు చీటీలు అంటిస్తున్నారు. ఇప్పటివరకు 20 వేల అబద్ధాలు చెప్పినట్లు ఈ గోడ సాక్ష్యంగా నిలుస్తున్నది. వీటితో పాటు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు కూడా ఉన్నాయి. ఈ అబద్ధాల గోడ దాదాపు 100 అడుగుల పొడవుతో ఒక మాదిరి కళాకృతిగా తయారైంది. రేడియో ఫ్రీ బ్రూక్లిన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిల్ బుహెలర్ మరియు టామ్ టెన్నీ దీనిని ఏర్పాటుచేశారు. 

తన అధ్యక్ష పదవి ప్రారంభమైనప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్ చెప్పిన తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను వాషింగ్టన్ పోస్ట్ ఫాక్ట్-చెకర్ ద్వారా గుర్తించింది. అమెరికా అధ్యక్షుడు రోజుకు సగటున 23 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ట్రంప్‌ చేసిన ప్రకటనలను విషయాలవారీగా రంగులు వేశారు. కాలక్రమాణుసారంగా.. ఇమ్మిగ్రేషన్, కరోనా వైరస్, పన్నులు, పర్యావరణం, ఉద్యోగం, రష్యా, ఉక్రెయిన్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ అబద్ధాల గోడను అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవగానే బుధవారం ఉదయం కూల్చివేసినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.