సోమవారం 01 జూన్ 2020
International - Apr 09, 2020 , 09:42:34

మిమ్మ‌ల్ని మ‌రిచిపోం.. థ్యాంక్యూ మోదీ : డోనాల్డ్ ట్రంప్‌

మిమ్మ‌ల్ని మ‌రిచిపోం.. థ్యాంక్యూ మోదీ :  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అడిగిన విష‌యం తెలిసిందే. అయితే అమెరికా కోరిక మేర‌కు.. భార‌త్ ఆ దేశానికి క్లోరోక్విన్ మాత్ర‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసింది.  దీనిపై ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లో స్నేహితుల మ‌ధ్య మ‌రింత స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ట్రంప్ అన్నారు.  హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై నిర్ణ‌యం తీసుకున్న ఇండియాకు, ఆ దేశ ప్ర‌జ‌ల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  మీరు అందించిన స‌హాయాన్ని ఎప్పుడూ మ‌రిచిపోమ‌న్నారు.  ప్ర‌ధాని మోదీకి కూడా ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.  మీ బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఇండియాకు దోహ‌ద‌ప‌డ‌డ‌మే కాదు, వైర‌స్‌పై పోరాటంలో అది మాన‌వాళిని ర‌క్షిస్తోంద‌న్నారు. logo