గురువారం 28 మే 2020
International - Apr 24, 2020 , 12:45:25

ట్రంప్ చిట్కాలు.. అమెరిక‌న్లు ఉక్కిరిబిక్కిరి

ట్రంప్ చిట్కాలు.. అమెరిక‌న్లు ఉక్కిరిబిక్కిరి

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైర‌టీ మ‌నిషి. డాక్ట‌ర్‌ను కాదంటూనే వైద్య చిట్కాలు చెప్పేస్తున్నారు. ఆయ‌న చెప్పే విష‌యాల్లో కొన్ని డౌట్లు పుట్టిస్తున్నాయి. ఆయ‌న వేసే డౌట్లు మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్నాయి. స‌ల‌హా ఇస్తున్నాడా .. చావు నుంచి కాపాడుతున్నాడో అర్థం కాని ప‌రిస్థితి. వైట్‌హౌజ్ మీడియాకు ట్రంప్ ఓ అంతుచిక్క‌ని వ్య‌క్తిగా మారారు. మొహ‌మాటం ఏదీ ఉండ‌దు. చెప్పాల‌నుకున్న‌ది చెప్పేస్తారు. వైర‌స్ వ‌ల్ల వేల మంది చ‌నిపోతున్నా.. ఆయ‌న మాత్రం మేటి డాక్ట‌ర్ త‌ర‌హాలో వెరైటీ స‌ల‌హాలు ఇస్తున్నారు. ఆరోగ్య‌శాఖ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా.. ట్రంప్ మాత్రం త‌న స‌హ‌జ ధోరిణి కొన‌సాగిస్తున్నారు.  గురువారం ట్రంప్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశం అమెరికా ప్ర‌జ‌ల‌ను మ‌రింత అయోమ‌యంలోకి నెట్టేసింది.  క్రిమిసంహార‌కాన్నిశ‌రీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. క‌రోనా వైర‌స్ ఒక్క నిమిషంలో చ‌నిపోతుంద‌నుకుంటా.. అవునంటారా కాదంటారా అంటూ ట్రంప్ ఒక్క‌సారి అంద‌రికీ షాక్ ఇచ్చారు.  ఇలా చేస్తే బాగుంటుందంటారా అన్న ఆశ్చ‌ర్యాన్నే ఆయ‌న డాక్ట‌ర్ల‌తో వ్య‌క్తం చేశారు.  క‌రోనాకు ఇదో ట్రీట్మెంట్  అన్న ఓ అభిప్రాయాన్ని ట్రంప్ వ్య‌క్త‌ప‌రిచారు. 

పేషెంట్ల‌కు అతినీల‌లోహిత‌ కిర‌ణాల‌ను ప్ర‌స‌రింపు చేస్తే క‌రోనా నుంచి కోలుకుంటార‌ని ట్రంప్ అన్నారు. అశాస్త్రీయ అభిప్రాయాల‌తో ట్రంప్ మామూలు టెన్ష‌న్ క్రియేట్ చేయ‌డంలేదు.  డాక్ట‌ర్లు ద్రువీక‌రించ‌ని ప‌ద్ధ‌తుల‌ను ట్రంప్ వెల్ల‌డిస్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. వాస్త‌వానికి యూవీ లైట్‌తో పాటు కొన్ని డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల్లో పేషెంట్లకు చికిత్స ఇస్తే.. వైర‌స్ త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వ ఆరోగ్య‌శాఖ అధికారులు అంగీక‌రించారు.  శ‌క్తివంత‌మైన లైట్‌ను మ‌నిషిపైకి ప్ర‌యోగిస్తే, వైర‌స్ చ‌నిపోతుందా, మీరు చెప్పింది నిజ‌మేనా, మ‌నుషుల‌పై ఆ టెస్ట్ చేశారా అని ట్రంప్ అడిగిన తీరు మ‌రో భ‌యాన్ని కూడా క్రియేట్ చేస్తున్న‌ది. కానీ డాక్ట‌ర్లు మాత్రం రేడియేష‌న్ ప‌ద్ధ‌తిని వ్య‌తిరేకించారు.

డిస్ఇన్‌ఫెక్టాంట్ అంటే క్రిమిసంహార‌కం. పురుగుల మందుల‌ను మ‌నుష‌ల‌కు ఎక్కిస్తే వైర‌స్ ఒక్క నిమిషంలో చ‌నిపోతుంద‌ట‌. ఇలాంటిది ఏమైనా చేయ‌వచ్చా అని ట్రంప్ మీడియా సమావేశంలోనే అధికారుల్ని అడిగారు.  క్రిమిసంహార‌కాన్ని ఇంజెక్ట్ చేస్తే అంతా క్లీన్ అవుతుందా, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి.. వాటిని శుభ్రం చేస్తుంద‌ని ట్రంప్ చెప్పారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని కూడా అన్నారు. కానీ వైద్యులు మాత్రం ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.  ఇలాంటి ప్ర‌యోగాలు ఎవ‌రు చేసినా.. అది వారికి హాని క‌లిగిస్తుంద‌ని అంటున్నారు.  వైద్యం కోసం బ్లీచింగ్ ప‌ద్ధ‌తులు స‌రికావ‌న్నారు. 

మ‌నిషి లాలాజ‌లం, ఊపిరితిత్తుల్లో ఉన్న ద్ర‌వాల‌కు బ్లీచింగ్ జ‌రిగితే.. 5 నిమిషాల్లో వైర‌స్ చ‌నిపోతుంద‌ని కొన్ని స్ట‌డీలు చెబుతున్నాయి. ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ కూడా ఆ వైర‌స్‌ను మ‌రింత వేగంగా చంపేస్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. యూఎస్ హోంల్యాండ్ సెక్యూర్టీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ డైర‌క్ట‌ర్ విలియం బ్రియాన్ వీటి గురించి విశ్లేషించారు.  హీట్ అండ్ లైట్ ప‌ద్ద‌తిని చికిత్స‌కు వాడుతున్నారా అని డాక్ట‌ర్ బ్రియాన్‌‌ను అడిగారు. కానీ దాన్ని చికిత్స ప‌ద్ధ‌తిలో వాడ‌లేద‌ని డాక్ట‌ర్ చెప్పారు. పేషెంట్ల‌కు 21 డిగ్రీల‌ సూర్య‌కాంతి నేరుగా త‌గిలితే, వైర‌స్ చ‌నిపోతుంద‌ని జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది. వాతావ‌ర‌ణం వేడిగా ఉన్నా.. నీడ‌లో ఉన్న ఉప‌రిత‌లంపై వైర‌స్ ఎక్కువ స‌మ‌యం బ్ర‌తికే ఉంటుంద‌ని డాక్ట‌ర్ తెలిపారు. ట్రంప్ సూచ‌న‌లు ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు కొంద‌రు డాక్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు.
logo