శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 13:10:40

ట్రంప్ అస‌మ‌ర్థ అధ్య‌క్షుడు : మిషెల్ ఒబామా

ట్రంప్ అస‌మ‌ర్థ అధ్య‌క్షుడు :  మిషెల్ ఒబామా

హైద‌రాబాద్: అమెరికా మాజీ ఫ‌స్ట్ లేడీ మిషెల్ ఒబామా.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.  ట్రంప్ ఓ అస‌మ‌ర్థ అధ్య‌క్షుడు అని ఆమె విమ‌ర్శించారు.  అత‌నిలో ఎటువంటి సానుభూతి కూడా లేద‌ని ఆమె అన్నారు.  డెమోక్ర‌టిక్ క‌న్వెన్ష‌న్‌లో పాల్గొన్న మిషెల్ మాట్లాడుతూ.. స‌మ‌ర్థ‌మైన నాయ‌క‌త్వం, ఓదార్పు, స్థిర‌త్వం కోసం శ్వేత‌సౌధం వైపు చూస్తే.. అక్క‌డ వాతావ‌ర‌ణం ఆందోళ‌న‌క‌రంగా, విభ‌జ‌నాత్మ‌కంగా, ఎటువంటి సానుభూతి లేకుండా ఉంద‌ని ఆమె విమ‌ర్శించారు. నిజాయితీతో మీకు ఒక విష‌యాన్ని చెబుతానని, ట్రంప్ మన దేశానికి స‌రైన అధ్య‌క్షుడు కాద‌ని ఆమె అన్నారు. డెమోక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ కూడా డోనాల్డ్ ట్రంప్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌పై ట్రంప్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు ఆయ‌న అన్నారు.  

   


logo