మంగళవారం 26 మే 2020
International - May 20, 2020 , 19:50:19

ఎక్కువ పరీక్షల వల్లే భారీ సంఖ్యలో కేసులు

ఎక్కువ పరీక్షల వల్లే భారీ సంఖ్యలో కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో ఎక్కువ సంఖ్యలో, వేగంగా పరీక్షలు నిర్వహించడం వల్లే 15 లక్షల మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా పరీక్షల విషయంలో మేం ఇతర దేశాలకు ఆదర్శంగా ఉన్నామన్నారు.  ఇప్పటివరకు 1.26 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించామని, నిజంగా ఇది అమెరికాకు గర్వకారణమని చెప్పారు. నేను ప్రచారం చేయడం వల్లే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుకు చెడ్డపేరు వచ్చిందని, వేరే ఎవరైనా ఈ మాత్రల గురించి చెప్పి ఉంటే వాటినే అద్భుతమైన ఔషధంగా అభివర్ణించేవారని పేర్కొన్నారు. ఇప్పటికే నేను అవే మాత్రలను వేసుకుంటున్నానని, ఇంకొన్ని రోజులు వాటినే వాడతానని స్పష్టంచేశారు.


logo