శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 21:55:29

కరోనాను జయించా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా: ట్రంప్

కరోనాను జయించా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా: ట్రంప్

వాషింగ్టన్: కరోనాను తాను జయించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఫాక్స్ న్యూస్ చానల్‌కు ట్రంప్ ఆదివారం ఇంటర్యూ ఇచ్చారు. కరోనా తనలో ఎంత మాత్రం లేదని, తన ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేదన్నారు. ‘ఉన్నతమైన కరోనా పరీక్షలో పాసయ్యాను.. మంచి ఆరోగ్యంతో ఉన్నాను.. ’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘కరోనాను జయించాను, వైరస్ రోగ నిరోధకశక్తిని కలిగి ఉన్నాను. ఇక ఆరు బయటకు వెళ్తాను’ అని చెప్పారు. సోమవారం నుంచి భారీ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్ పాల్గొంటారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ట్రంప్ వల్ల ఇతరులకు కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం లేదని ఆయన వైద్యులు శనివారం తెలిపారు. అయితే ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చిందా లేదా అన్నది స్పష్టం చేయలేదు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo