శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 16, 2020 , 01:51:36

ఫేస్‌బుక్‌లో నేనే నంబర్‌ వన్‌!

ఫేస్‌బుక్‌లో నేనే నంబర్‌ వన్‌!
  • భారత్‌ పర్యటన కోసం ఆసక్తిగా చూస్తున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ప్రజాదరణపరంగా తాను నంబర్‌ వన్‌ అని తర్వాతి స్థానంలో భారత ప్రధాని మోదీ ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ తనతో చెప్పినట్టు ఆయన వెల్లడించారు. అలాగే, భారత్‌ పర్యటన కోసం తాను ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘ఫేస్‌బుక్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ నెంబర్‌ వన్‌ అని, తర్వాత ప్రధాని మోదీ ఉన్నారని ఇటీవల జుకర్‌బర్గ్‌ అన్నారు. ఇది గొప్ప గౌరవం అనుకుంటా! నిజానికి, రెండు వారాల్లో నేను భారత్‌కు వెళ్లబోతున్నా. ఆ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ తన సతీమణి మెలినియాతో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు. 


logo