శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 08:50:48

వుహాన్ ల్యాబ్‌తో వైర‌స్‌కు లింకుంది: డోనాల్డ్ ట్రంప్

వుహాన్ ల్యాబ్‌తో వైర‌స్‌కు లింకుంది: డోనాల్డ్ ట్రంప్

హైద‌రాబాద్‌: చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న వైరాల‌జీ ల్యాబ్‌తో క‌రోనా వైర‌స్‌కు లింకు ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ దేశంపై మ‌రోసారి భారీ స్థాయిలో వాణిజ్య ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల సుమారు 2.30 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. నోవెల్ క‌రోనా వైర‌స్ వుహాన్ వైరాల‌జీ ల్యాబ్ నుంచి విస్త‌రించిన‌ట్లు వ‌దంతులు వ‌స్తున్న నేప‌థ్యంలో.. దీనిపై మీడియా స‌మావేశంలో ట్రంప్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.  క‌రోనా మ‌హ‌మ్మారికి వుహాన్ ల్యాబ్‌తో లింకు ఉన్న‌ట్లు మీ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయా అని రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు ట్రంప్ అవున‌ని స‌మాధానం ఇచ్చారు.  అంత న‌మ్మ‌కంగా ఎలా చెబుతున్నార‌ని మ‌రో ప్ర‌శ్న వేయ‌గా.. ఆ విష‌యాల‌ను తాను బ‌హిర్గ‌తం చేయ‌ద‌లుచుకోలేద‌న్నారు.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో చైనా పొర‌పాటు చేసిన‌ట్లు ట్రంప్ ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. చైనా వ‌స్తువుల‌పై అధిక సుంకాలు విధించ‌నున్న‌ట్లు కూడా తెలిపారు.logo