సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 09:14:09

భార‌త్‌, చైనా ప్ర‌జ‌ల శాంతి కోసం ఏదైనా చేస్తా : ట‌్రంప్‌

భార‌త్‌, చైనా ప్ర‌జ‌ల శాంతి కోసం ఏదైనా చేస్తా : ట‌్రంప్‌

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా ప్ర‌జ‌ల్ని ప్రేమిస్తాన‌ని, వారు శాంతియుతంగా ఉండేందుకు ఏదైనా చేస్తాన‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  శ్వేత‌సౌధ మీడియా కార్య‌ద‌ర్శి కేలీగ్ మెక‌న్నే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  చైనాతో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన నేప‌థ్యంలో.. భార‌త్‌కు అమెరికా ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మాట్లాడిన ట్రంప్‌.. భార‌త్, చైనా దేశ ప్ర‌జ‌ల్ని ప్రేమిస్తాన‌ని చెప్పిన‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ తెలిపారు. రెండు దేశాల ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండేందుకు ట్రంప్ ఏదైనా చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.  

భార‌త్‌కు త‌మ‌కు మంచి భాగ‌స్వామి అని, ప్ర‌ధాని మోదీకి ట్రంప్ మంచి మిత్రుడు అని వైట్‌హౌజ్ ఎక‌నామిక్ అడ్వైజ‌ర్ ల్యారీ కుడ్లో తెలిపారు. అమెరికా మిత్ర‌దేశంగా భార‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా వెల్ల‌డించారు. భార‌త్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ట్రంప్‌కు ట్రంప్ విక్ట‌రీ ఇండియ‌న్ అమెరిక‌న్ ఫైనాన్స్ క‌మిటీ థ్యాంక్స్ చెప్పింది. గ‌త నేత‌ల క‌న్నా ట్రంప్ బ‌హిరంగంగా భార‌త్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. గ‌తంలో డెమోక్ర‌టిక్ నేత అయినా, లేక రిప‌బ్లిక‌న్ నేత అయినా.. క్లింట‌న్ లేదా సీనియ‌ర్ బుష్ లేదా జూనియ‌ర్ బుష్ లేదా ఒబామా అయినా.. చైనాకు భ‌య‌ప‌డి భార‌త్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేవారు కాద‌ని ఆ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. భార‌త్‌ను ప్రేమిస్తాను, భార‌త్‌ను గౌర‌విస్తాం, భార‌త్‌కు మ‌ద్ద‌తుగా ఉన్నామ‌ని ధైర్యంగా చెప్పిన నేత ట్రంప్ అని ఫైనాన్స్ క‌మిటీ చీఫ్ అల్ మాస‌న్ తెలిపారు. logo