గురువారం 28 మే 2020
International - Apr 27, 2020 , 15:49:27

ఆ వ్యాఖ్య‌ల‌పై అతి ప్ర‌చారం ఆందోళ‌న‌కరం

ఆ వ్యాఖ్య‌ల‌పై అతి ప్ర‌చారం ఆందోళ‌న‌కరం

కోవిడ్‌-19 వైర‌స్ సోకిన రోగుల‌కు స‌రైన మందులు లేక‌పోవ‌టంతో పురుగుమందులు ఇస్తే బాగుంటుందేమోన‌న్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై అమెరికాలో ఇంకా దుమారం రేగుతూనే ఉంది. అక్క‌డి మీడియా అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌పై పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్న‌ది. ఈ ప‌రిణామంపై కోవిడ్‌-19 వైర‌స్‌పై అధ్య‌క్ష భ‌వ‌నం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ స‌భ్యురాలు డెబోరా బిర్క్స్ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. అధ్య‌క్షుడు ఈ వ్యాఖ్య‌లు చేసి నాలుగైదు రోజులైనా ఇంకా మీడియాలో దానిగురించి చ‌ర్చ జ‌ర‌గ‌టం ఆందోళ‌న‌క‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుత స‌మ‌స్య ప‌రిష్కారానికి అవ‌స‌ర‌మైన పెద్ద విష‌యాల‌ను వ‌దిలేసి ఇలాంటి చ‌ర్చ‌లు చేయ‌టం మంచిదికాద‌ని పేర్కొన్నారు. క‌రోనా రోగుల శ‌రీరాల్లోకి ప్ర‌మాదం లేని స్థాయిలో పురుగుమందులు ఎక్కిస్తే ఎలా  ఉంటుందో అధ్య‌య‌నం చేయాల‌ని త‌న స‌ల‌హాదారుకు ట్రంప్ గ‌త బుధ‌వారం సూచించారు. 


logo