సోమవారం 01 జూన్ 2020
International - May 19, 2020 , 08:18:03

‘ఔను.. నేను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వేసుకుంటున్నా’

‘ఔను.. నేను హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వేసుకుంటున్నా’

 వాషింగ్టన్‌: మలేరియా రోగనిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను గత కొన్ని రోజులుగా వేసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాను కరోనా నెగెటివ్‌ అని తేలినప్పట్టికీ ముందుజాగ్రత్త చర్యగా సుమారు రెండు వారాలుగా తాను ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్లు  వేసుకుంటున్నానని అందరినీ ఆశ్చార్యానికి గురిచేశారు. కరోనా వైరస్‌ రోగులకు ఇది పనిచేయదని తన ప్రభుత్వంలోని అధికారులు గతంలో ప్రకటించారు. అయితే తాను ఇది మంచిదని నమ్ముతున్నాని తెలిపారు. అమెరికాలో ఇప్పటివరకు 91,891 మంది కరోనా వైరస్‌తో మరణించారు. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్రాబ్లెట్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.


logo