ఆదివారం 06 డిసెంబర్ 2020
International - Nov 15, 2020 , 21:18:34

ఫేక్‌ న్యూస్‌ మీడియాలోనే ఆయన గెలిచాడు : ట్రంప్‌

ఫేక్‌ న్యూస్‌ మీడియాలోనే ఆయన గెలిచాడు : ట్రంప్‌

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా బహిరంగంగా అమెరికా ఎన్నికలను అంగీకరించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ జో బైడెన్ గెలిచారని ఆదివారం బహిరంగంగా అంగీకరించినట్లు కనిపించారు.  అయితే, బైడెన్‌ గెలుపు కేవలం ఫేక్‌ న్యూస్‌ మీడియాలోనే అని వ్యంగ్యంగా ట్విట్టర్‌లో  రాశారు. విస్తృతమైన ఓటింగ్ మోసాలు, రిగ్గింగ్‌ చేశారని తన తప్పుడు వాదనలను పునరుద్ఘాటించారు. "ఎన్నికలను రిగ్గింగ్‌ చేసినందున అతను గెలిచాడు" అని ట్రంప్ ఆదివారం ఉదయం ట్విట్టర్లో రాశారు. అయితే ట్వీట్‌లో జో బైడెన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. "ఓటు పరిశీలకులు అనుమతించలేదు. రాడికల్ లెఫ్ట్ ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థ డొమినియన్ చేత ఓటు వేసుకున్నారు. ఆయన ఫేక్ న్యూస్‌ మీడియా దృష్టిలోనే విజయం సాధించారు" అని ట్విట్టర్‌లో రాశారు. 

ఫలితాలను తారుమారు చేయడం ద్వారా విజయం సాధించారని, దీనిపై విచారణ జరుపాలని కోరుతూ కోర్టులో ట్రంప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫెడరల్ ఏజెన్సీ, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ బైడెన్ విజయాన్ని ఇంకా గుర్తించలేదని వాదిస్తున్నారు ట్రంప్‌ మద్దతుదారులు. ఇలా ఉండగా, అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇరు పార్టీల ఎన్నికల అధికారులు తెలిపారు. ట్రంప్‌కు విజయాన్ని అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, అమెరికా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని డెమోక్రాట్లతోపాటు ఇతర విమర్శకులు ఆరోపించారు. ఎన్నికలకు ముందు శాంతియుతంగా అధికార బదిలీకి పాల్పడటానికి ట్రంప్ నిరాకరించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బైడెన్‌ను విజేతగా గుర్తించకూడదని ట్రంప్ పరిపాలన తీసుకున్న నిర్ణయం.. బైడెన్, అతని బృందాన్ని ప్రభుత్వ కార్యాలయ స్థలాల్లోకి ప్రవేశం పొందకుండా నిరోధించిలా చూడనున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

2016 లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన రాష్ట్రాల్లో ప్రస్తుతం బైడెన్ ఆధిక్యతను సాధించాడు. బైడెన్‌ జాతీయ ప్రజాదరణ పొందిన ఓటును 5.5 మిలియన్లకు పైగా లేదా 3.6 శాతం పాయింట్లతో గెలుచుకున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.