మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 10:28:34

ట్రంప్ చెల్లించిన ట్యాక్స్ కేవ‌లం 750 డాల‌ర్లే..

ట్రంప్ చెల్లించిన ట్యాక్స్ కేవ‌లం 750 డాల‌ర్లే..

 హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ గ‌త కొన్నేళ్ల నుంచి ఆదాయం ప‌న్ను స‌రిగా క‌ట్ట‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  దీనికి సంబంధించిన న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని రాసింది.  అధ్య‌క్షుడిగా పోటీప‌డిన 2016 సంవ‌త్స‌రంలో ట్రంప్ కేవ‌లం 750 డాల‌ర్లు మాత్ర‌మే ఆదాయంప‌న్నుగా చెల్లించిన‌ట్లు తేలింది.  ఆ త‌ర్వాత ఏడాది కూడా అధ్య‌క్షుడు ట్రంప్ అంతే మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో చెల్లించిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. గ‌త రెండు ద‌శాబ్ధాల‌కు చెందిన ట్రంప్ ఆదాయ‌ప‌న్ను వివ‌రాల‌ను పత్రిక సేక‌రించింది. గ‌డిచిన 15 ఏళ్ల‌లో అమెరికా అధ్య‌క్షుడు సుమారు ప‌దేళ్లు ఎటువంటి ప‌న్ను క‌ట్ట‌లేద‌ని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దీర్ఘ‌కాలిక‌మైన న‌ష్టాలను సాకుగా చూపుతో ట్రంప్ కంపెనీలు ట్యాక్స్‌ను ఎగ‌వేసిన‌ట్లు రికార్డుల్లో చూపారు. 

అయితే ఈ వార్త‌క‌థనాన్ని ఓ ఫేక్ న్యూస్‌గా ట్రంప్ విమ‌ర్శించారు. నిజానికి నేను ట్యాక్స్ క‌ట్టాను, ట్యాక్స్ రిట‌ర్న్స్ వ‌చ్చాక మీకే అర్థం అవుతుంద‌ని, ప్ర‌స్తుతం ఆ రికార్డుల‌న్నీ ఆడిట్ జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఇంట‌ర్న‌ల్ రెవ‌న్యూ స‌ర్వీసు(ఐఆర్ఎస్‌) త‌న‌ను స‌రిగా ట్రీట్ చేయ‌లేద‌ని ట్రంప్ ఆరోపించారు. త‌న వ్యాపారం, సంప‌ద‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు ట్రంప్ నిరాక‌రించిన విష‌యంలో అనేక న్యాయ స‌వాళ్ల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు.  1970 నుంచి ఆదాయ‌ప‌న్ను వివ‌రాల‌ను వెల్ల‌డించని తొలి అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ నిలిచారు.   


logo