గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 01:37:04

ట్రంప్‌ కట్టిన పన్ను 750 డాలర్లే

ట్రంప్‌ కట్టిన పన్ను 750 డాలర్లే

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పన్నుల ఎగవేత ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన 2016లో కేవలం 750డాలర్లు మాత్రమే కార్పొరేట్‌ పన్ను రూపంలో చెల్లించారని న్యూయార్క్‌టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 2017లో కూడా అంతే మొత్తం పన్నుకింద చెల్లించారని, అదే ఏడాది భారత్‌లో ఆయన కార్పొరేట్‌ పన్ను 145,400 డాలర్లు చెల్లించారని పేర్కొంది. దీన్ని ట్రంప్‌ ఖండించారు. మరోవైపు డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు డ్రగ్‌ టెస్టు చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇద్దరి మధ్య మొదటి బహిరంగ చర్చ జరుగనున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


logo