మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 21:00:51

కరోనా.. చైనా ప్లేగు: ట‌్రంప్‌

కరోనా.. చైనా ప్లేగు: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైన చైనాపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. చైనా నుంచి ఈ ప్లేగు వ్యాధి వ‌చ్చి ఉండాల్సింది కాద‌ని అన్నారు. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిన ఒక‌ ప్లేగు వ్యాధి అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో జ‌రిగిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేష్‌ అనే కార్య‌క్ర‌మంలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. చైనా ఈ మ‌హ‌మ్మారిని విస్త‌రింప‌జేయ‌కుండా ఉండాల్సిందని, కానీ విస్తరింప‌జేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

చైనాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రాండ్-న్యూ ట్రేడ్ ఒప్పందం చేసుకుంద‌ని, ఆ ఒప్పందంపై చేసిన సంత‌కంలో సిరా ఆర‌క‌ముందే క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించింద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. గ‌త ఏడాది ఆఖ‌రులో వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్లో పుట్టుకొచ్చిన క‌రోనా ప్ర‌పంచ దేశాల‌ను చుట్టుముట్టి 5.20 ల‌క్ష‌ల మందికిపైగా చావుల‌కు కార‌ణ‌మైంది. ఇక అమెరికాలో 27.39 ల‌క్ష‌ల మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. 1.28 ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.       


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo