సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 10, 2020 , 09:39:57

ర‌క్ష‌ణ మంత్రిపై ట్రంప్ వేటు

ర‌క్ష‌ణ మంత్రిపై ట్రంప్ వేటు

హైద‌రాబాద్‌: అమెరికా ర‌క్ష‌ణ మంత్రి మార్క్ ఎస్ప‌ర్‌పై వేటు ప‌డింది.  ఎస్ప‌ర్‌ను తొల‌గిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.  నేష‌న‌ల్ కౌంట‌ర్ టెర్ర‌రిజం అధిప‌తిగా ఉన్న క్రిస్టోఫ‌ర్ మిల్ల‌ర్‌ను నూత‌న ర‌క్ష‌ణ మంత్రిగా నియ‌మిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. తాజాగా ముగిసిన దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో.. బైడెన్ చేతిలో ట్రంప్ ఓడినా.. ఆయ‌న మాత్రం ఇంకా ఓట‌మిని అంగీక‌రించ‌లేదు. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కోర్టులో ట్రంప్ స‌వాల్  చేయ‌నున్నారు.  46వ దేశాధ్య‌క్షుడిగా బైడెన్ ఎన్నికైనా.. జ‌న‌వ‌రి 20వ తేదీన జ‌రిగే ప్ర‌మాణ స్వీకారోత్స‌వం వ‌ర‌కు ట్రంప్ త‌న అధికారాల‌ను వినియోగించ‌వ‌చ్చు.  ర‌క్ష‌ణ మంత్రి మార్క్ ఎస్ప‌ర్‌ను ట‌ర్మినేట్ చేశాన‌ని, ఆయ‌న చేసిన సేవ‌ల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.