శనివారం 06 జూన్ 2020
International - May 13, 2020 , 02:37:45

తెంపరి ట్రంప్‌.. మధ్యలోనే జంప్‌

తెంపరి ట్రంప్‌.. మధ్యలోనే జంప్‌

చైనా సంతతి విలేకరిపై అసహనం..ప్రెస్‌మీట్‌ నుంచి అర్ధాంతరంగా వాకౌట్‌

వాషింగ్టన్‌: నిత్యం ఎవరో ఒకరిపై నోరుపారేసుకొని వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అదే పని చేశారు. కొవిడ్‌-19 పరిస్థితులపై సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చైనా సంతతి సీబీఎస్‌ విలేకరి వీజియా జియాంగ్‌, అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకునపెట్టే ప్రశ్న వేశారు. ఇతర దేశాలకంటే అమెరికాలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ప్రతిరోజూ ఎందుకు పోల్చి చెబుతున్నారు? ఒకవైపు అమెరికన్లు రోజూ చనిపోతుంటే మీరు ప్రపంచంతో ఎందుకు పోటీ పడుతున్నారు? అని నిలదీశారు. దాంతో చిర్రెత్తిపోయిన ట్రంప్‌ ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చనిపోతున్నారు. మీరు ఈ ప్రశ్నను చైనాను అడిగితే బాగుంటుంది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో ఆమె చైనాను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించటంతో ట్రంప్‌ తీవ్ర అసహనంతో ఊగిపోయారు. తన ప్రశ్నకు సమాధానం కావాలని జియాంగ్‌ రెట్టించటంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు.   logo