శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 09:30:52

అధ్య‌క్ష ఎన్నిక‌లను వాయిదా వేసే అధికారం ట్రంప్‌కు లేదు..

అధ్య‌క్ష ఎన్నిక‌లను వాయిదా వేసే అధికారం ట్రంప్‌కు లేదు..

హైద‌రాబాద్‌: ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్ర‌తిపాద‌న రిప‌బ్లిక‌న్ పార్టీ పెద్ద‌లు వ్య‌తిరేకించారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింద‌ని, ఈ ద‌శ‌లో ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌న్న ట్రంప్ అభ్య‌ర్థ‌న‌ను సేనేట్ మెజారిటీ నేత మిచ్ మెక్‌కాన‌ల్‌, హౌజ్ మైనార్టీ నేత కెవిన్ మెకార్తీలు తోసిపుచ్చారు. అధ్య‌క్ష ఎన్నిక‌లను వాయిదా వేసే అధికారం ట్రంప్‌కు లేద‌ని క‌మిటీ రిప‌బ్లిక‌న్ నేత‌లు తేల్చారు. ఒక‌వేళ వాయిదా వేయాల‌నుకుంటే, అప్పుడు దానికి ఉభ‌య‌స‌భ‌ల ఆమోదం ఉండాల‌న్నారు. 

పోస్ట‌ల్ ఓటింగ్ పెర‌గ‌డం వ‌ల్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఫ‌లితాలు కూడా తారుమార‌య్యే ఛాన్సు ఉన్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. క‌రోనా నేప‌థ్యంలో ఇ-మెయిల్ ఓటింగ్‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అమెరికా భావిస్తున్న‌ది. అయితే ట్రంప్ చేసిన తాజా ప్ర‌తిపాద‌న మాత్రం స్వంత పార్టీ వారే వ్య‌తిరేకిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెయిల్‌ ద్వారా ఓటేసే సదుపాయాన్ని కల్పించాలని రాష్ర్టాలు కోరుతున్నాయి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. మరోవైపు,  చైనా, రష్యా, భారత్‌లు తమ దేశాల్లో పర్యావరణ పరిరక్షణను పట్టించుకోవని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా మాత్రం ఆ పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మరోమారు సమర్థించుకున్నారు. logo