బుధవారం 27 మే 2020
International - Apr 27, 2020 , 01:03:19

నాకు విలువివ్వడం లేదు

నాకు విలువివ్వడం లేదు

  • మీడియాపై ట్రంప్‌ అలక 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాపై అలిగారు. తన అభిప్రాయాలకు విలువివ్వడం లేదంటూ వాపోయారు. ‘కరోనా చికిత్సలో శరీరంలోకి క్రిమి సంహారకాలను, యూవీ కాంతిని పంపండి’ అంటూ ట్రంప్‌ ప్రమాదకర సూచనలు ఇవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు మౌనంగా ఉండాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా శనివారం మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు. ఒక వర్గం మీడియా పూర్తిగా విరుద్ధ ప్రశ్నలనే అడుగుతున్నదని, వాస్తవాలను రిపోర్టు చేయడానికి నిరాకరిస్తున్నదని ధ్వజమెత్తారు.


logo