సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 00:37:07

కాంట్రాక్టు ఉద్యోగాల్లోనూ స్థానికులే!

కాంట్రాక్టు ఉద్యోగాల్లోనూ స్థానికులే!

  • ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న విదేశీయులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిడుగులాంటి వార్త చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో అమెరికన్లను మాత్రమే నియమించుకునేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులను కాంట్రాక్టు కొలువుల నుంచి తీసివేసి ఆ స్థానాల్లో విదేశీయులను నియమించుకునే పద్ధతికి స్వస్తి పలికారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్‌ సోమవారం సంతకాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.


logo