శనివారం 28 మార్చి 2020
International - Mar 21, 2020 , 09:16:12

'జీరో కాంటాక్ట్ డెలివరీ' సేవలు ప్రారంభించిన డొమినోస్ పిజ్జా

'జీరో కాంటాక్ట్ డెలివరీ'  సేవలు ప్రారంభించిన డొమినోస్ పిజ్జా

హైదరాబాద్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డొమినోస్ పిజ్జా మెరుగైన పరిశుభ్రతను పాటిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న1325 డొమినోస్ పిజ్జా రెస్టారెంట్లలో“జీరో కాంటాక్ట్ డెలివరీ ”సేవలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా  వినియోగదారులకు డెలివరీ సిబ్బందితో సంబంధం లేకుండా ఆర్డర్లను స్వీకరిస్తారు. కస్టమర్లు, డెలివరీ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తచర్యగా ఈ ప్రత్యేక విధానాన్ని ప్రవేశ పెట్టింది డొమినోస్ సంస్థ. 

'జీరో కాంటాక్ట్ డెలివరీ' సేవలను పొందడానికి,  వినియోగదారులు డొమినోస్ అప్లికేషన్ నూతన వెర్షన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసేటప్పుడు 'జీరో కాంటాక్ట్ డెలివరీ'  ఆప్షన్ ను ఎంచుకోవాలి.  పరిశుభ్రతలో భాగంగా డొమినోస్ పిజ్జా కంపెనీ ఉద్యోగులకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. తమ వినియోగదారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా డొమినోస్ పిజ్జా పనిచేస్తున్నదని , అందుకోసమే మెరుగైన సేవలు అందించేందుకు సిధ్దమైనాట్లు ఆ సంస్థ పేర్కొన్నది.    



logo