బుధవారం 15 జూలై 2020
International - Mar 28, 2020 , 14:08:24

లాక్‌డౌన్‌.. 30 శాతం పెరిగిన గృహ హింస కేసులు

లాక్‌డౌన్‌.. 30 శాతం పెరిగిన గృహ హింస కేసులు


హైద‌రాబాద్‌: క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే నేప‌థ్యంలో ఫ్రాన్స్‌లో మార్చి 17వ తేదీన లాక్‌డౌన్ విధించారు. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతంపైగా గృహ హింస కేసులు న‌మోదు అయ్యాయి. ఈ విష‌యాన్ని ఆ దేశ హోంమంత్రి క్రిస్టోఫ‌ర్ కాస్ట్న‌ర్ తెలిపారు.  20వేల జ‌న‌భా ఉండే ప‌ట్ట‌ణాల్లో 32 శాతం, పారిస్‌లో 36 శాతం గృహ హింస కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు, దాంతో ఇండ్ల వ‌ద్ద వేధింపులు ఎక్క‌వ‌వుతున్నాయి. అయితే గృహ హింస బాధితుల‌కు సాయం చేసే ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. భ‌ర్త‌ లేకుండా ఫార్మ‌సీల‌కు వెళ్లే వారికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆడ‌వారి ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక కోడ్ సిస్ట‌మ్‌ను అభివృద్ధి ప‌రుస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. డొమెస్టిక్ వాయిలెన్స్ కేసుల విష‌యంలో ఇప్ప‌టికే స్పెయిన్ దేశం ప్ర‌త్యేక కోడ్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్న‌ది.  ఎమ‌ర్జెన్సీ కాల్స్ స్వీక‌రించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నార‌ని కూడా మంత్రి తెలిపారు. 


logo