పారిస్: అమెరికా సింగర్ డోజా క్యాట్ భగభగ మెరిసిపోయింది. నిలువునా రెడ్ కలర్ కాస్ట్యూమ్‌తో కేక పుట్టించింది. 27 ఏళ్ల ఆ పాప్ సింగర్.. పారిస్ ఫ్యాషన్ షోలో స్వరోస్కీ క్రిస్టల్స్‌తో డిఫరెంట్ లుక్‌తో అదరగొట్టింది. సుమారు 30 వేల స్వరోస్కీ క్రిస్టల్స్‌తో ఆమె తన శరీరాన్ని నింపేసింది. షియాపరేలీ ఫ్యాషన్ వీక్‌కు వచ్చిన డోజా క్యాట్.. తన కొత్త లుక్‌తో అందర్నీ స్టన్ చేసింది. ఆమె శరీరానికి క్రిస్టల్స్‌తో మేకప్ చేయడానికి సుమారు అయిదు గంటలు పట్టినట్లు తెలుస్తోంది.
మేకప్ ఆర్టిస్ట్ ప్యాట్ మెక్‌గ్రాత్ .. డోజా క్యాట్‌ను ఇలా వెరైటీగా తయారు చేశారు. రెడ్ కలర్ సిల్క్ దుస్తులపై క్రిస్టల్స్‌ను అమర్చారు. డోజా క్యాట్‌కు చెందిన కొన్ని వీడియోలను షియాపరేలీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. స్కర్ట్‌ను కూడా చేతితో నేశారు. ఇక పూసలు కూడా ఆమె డ్రెస్సులో స్పెషల్‌గా కనిపించాయి. స్వరోస్కీ క్రిస్టల్స్‌ను డోజా క్యాట్.. తల, ఛాతి, వెన్ను, చేతులకు సెట్ అయ్యేలా డ్రెస్సును డిజైన్ చేశారు.
ఈ రెడ్ కలర్ మేకప్ కోసం చాలా కష్టపడ్డారు. ముందుగా డోజా క్యాట్‌కు ఎరుపు రంగు విగ్‌ను అమర్చారు.ఆ తర్వాత ఆ విగ్‌కు కలర్స్‌తో పాటు క్రిస్టల్స్‌ను కలిపారు.