మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 17:00:18

కరోనా కాలంలో శునక సేవలు.. అన్నీఇన్నీ కావయా!

కరోనా కాలంలో శునక సేవలు.. అన్నీఇన్నీ కావయా!

కొలంబియా: కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో కూరగాయలు, నిత్యావసరాల కోసం ప్రజలు మార్కెట్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ టైమ్‌లో కొందరు ఆన్‌లైన్ డెలివరీలపై ఆధారపడుతున్నారు. అయితే కరోనా వైరస్ పెరగడంతో డెలివరీ చేయడం కూడా సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు కొలంబియాకు చెందిన ఓ మినీ మార్కెట్ యజమాని చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టాడు. తాను పెంచుకుంటున్న కుక్కను వినియోగదారులకు అవసరమైన సామగ్రి అందజేయడానికి వాడుకుంటున్నాడు.

ఎనిమిదేళ్ల ఈ కుక్క పేరు ఎరోస్. ఈ లాబ్ర డాగ్ తన గట్టి దవడలతో బాస్కెట్‌ను పెట్టుకొని కస్టమర్స్‌ ఇండ్లకు వెళ్లి సామాన్లు డెలివరీ చేస్తున్నది. కస్టమర్స్‌కు అవసరమైన కూరగాయలు, పండ్లను ఈ శునకం నేరుగా వారింటికెళ్లి అందిస్తున్నది. సామగ్రి అందించగానే దానికి ఏదో ఒకటి తినడానికి ఇచ్చేవరకు అది వెనక్కి కదలదు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ కుక్కకు అడ్రస్‌లు చదవడం రాదు. కానీ కస్టమర్స్ పేర్లను గుర్తు పెట్టుకుంటుందంట. 


భౌతిక దూరం పాటించేందుకు ఈ శునకం ఎంతో సాయపడుతోందని ఆ డాగ్ యజమాని మారియా నత్విదాద్ బొటెరో చెప్పాడు. ఎరోస్‌ను డెలివరీకి పంపినప్పుడు ప్రజలు దాన్ని చాలా ఇష్టపడుతున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. ఎరోస్‌కు ఐదారుగురు కస్టమర్స్‌ పేర్లు తెలుసు. సరుకుల బాస్కెట్‌లో రిసిప్ట్‌ను పెట్టి కస్టమర్స్ ఇండ్లకు పంపుతా. అవి అందిన వెంటనే వారు ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. సామాను తీసుకొన్న ఇచ్చిన తర్వాత తినడానికి ఏదోటి ఇచ్చేంత వరకు అది అస్సలు కదలదు’ అని బొటేరో నవ్వుతూ చెప్పాడు. 


logo