మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 07, 2020 , 13:25:42

క‌ళ్లు క‌నిపించ‌క‌పోయినా ఎంత ఆనందంగా గంతులేస్తుందో : వీడియో వైర‌ల్‌

క‌ళ్లు క‌నిపించ‌క‌పోయినా ఎంత ఆనందంగా గంతులేస్తుందో :  వీడియో వైర‌ల్‌

లోక‌జ్ఞానం తెలిసిన మ‌నుషుల‌కే క‌ళ్లు క‌నిపించ‌క‌పోతే ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. క‌ళ్లు క‌నిపించ‌క‌పోతే లోకాన్ని చూడ‌లేక‌పోతున్నామ‌ని కుమిలిపోతూ నిరుత్సాహప‌డేవారికి ఈ కుక్క ఆద‌ర్శంగా నిలుస్తుంది. క‌ళ్లు క‌నిపించ‌నంత మాత్రాన జీవితం ఆగిపోదు. మ‌న‌సుతో జీవితాన్ని గెల‌వొచ్చు అని రుజువు చేస్తున్నది ఈ కుక్క‌. దీనికి క‌ళ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతోపాటు సెరెబెల్లార్ హైపోప్లాసియాతో బాధ ప‌డుతున్న‌ది.

ఇన్ని లోపాలు ఉన్న ఈ కుక్క అవేం ప‌ట్టించుకోకుండా ఎంతో ఆనందంతో బుర‌ద‌లో ఎలా చిందులేస్తుందో చూడండి. ఈ క్లిప్‌ను అమెరిక‌న్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో పంచుకున్నారు. కుక్క ముఖంలో ఉన్న స్వ‌చ్ఛ‌మైన ఆనందం ఖ‌చ్చితంగా అంద‌రికీ ఆనందాన్నిస్తుంది. అయితే కొంత‌మంది దీనిని చూసి కుక్క గుడ్డిది కాద‌ని, బ‌దులుగా సెరెబెల్లార్ హైపోప్లాసియా ఉంద‌ని కామెంట్లు పెడుతున్నారు. 


 


logo