శనివారం 23 జనవరి 2021
International - Dec 19, 2020 , 18:53:11

గేర్‌మార్చిన కుక్క.. గుంతలో పడ్డ కారు..!

గేర్‌మార్చిన కుక్క.. గుంతలో పడ్డ కారు..!

అంటారియో: కుక్కలు విశ్వాస జంతువులే. అలా అని వాటికి డ్రైవింగ్‌ చాన్స్‌  ఇస్తే ఏమవుద్దో తెలుసా.. బొక్కాబోర్లా పడుతాం. కెనాడాలోని అంటారియోలో అదే జరిగింది. ఓ మహిళ కుక్కను కారులో వదిలేసింది. గేర్ మార్చడం నేర్చుకున్న కుక్క కారును బోల్తా కొట్టించింది. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  

అంటారియోలోని ఒక మహిళ డిసెంబర్ 9 న నార్త్ గ్రెన్విల్లేలోని జాన్స్టన్ రోడ్‌ తన కుక్కను కారు లోపల వదిలివేసింది. అయితే, కుక్కపిల్ల రివర్స్‌ గేర్‌ మార్చింది. అంతే కారు వెనక్కు వెళ్లడం ప్రారంభించింది. ఇది గమనించిన యజమానురాలు కారును ఆపేందుకు పరుగెత్తింది. కారు వెనుక ఉన్న గుంతలో పడగా, ఆమెకు స్వల్పగాయాలయ్యాయి.   

ఇవి కూడా చదవండి..

స్కూల్‌టాయిలెట్లో రేవ్‌పార్టీ పెట్టాడు.. దొరికిపోయాడు!

డియర్‌ శాంటా.. కరోనాతో డబ్బుల్లేవు.. ప్లీజ్‌ నాకో బొమ్మ కొనిపెట్టవా!

వామ్మో ఇన్ని తాబేళ్లను మీరెప్పుడైనా చూశారా? వీడియో వైరల్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo