ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 15:26:27

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న కుక్క‌.. స్కేట్‌బోర్డు మీద గ‌ల్లీల‌న్నీ తిరిగేస్తుంది!

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న కుక్క‌.. స్కేట్‌బోర్డు మీద గ‌ల్లీల‌న్నీ తిరిగేస్తుంది!

కుక్క‌లు మ‌నుషుల కంటే ఎందులోను తీసిపోవ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు అవుతూనే ఉంది. అన్ని తెలివితేట‌లు ఉన్న మ‌నుషులు స్టేట్ బోర్డు మీద విన్యాసాలు చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. అలాంటిది కుక్క ఎంతో అనుభ‌వం ఉన్న‌ట్లుగా స్కేట్ బోర్డు ఎక్కి గ‌ల్లీల‌న్నీ తిరిగేస్తున్న‌ది. 36 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

'స్కేట‌ర్ గుడ్ బాయ్' అనే క్యాప్ష‌న్‌ను చాప్మ‌న్ జోడించారు. కుక్క స్కేటింగ్ చేస్తుంటే, రోడ్డు మీదున్న కొంద‌రు వీడియో తీసుకుంటున్నారు. ఒక గ‌ల్లీ నుంచి మ‌రో గ‌ల్లికి తిరుగుతూ కుక్క చ‌క్క‌ర్లు కొడుతున్నది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 576.5 కే మంది వీక్షించారు. 'నాకంటే ఈ చిన్న కుక్క‌పిల్ల బెట‌ర్' అంటూ ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. ఏదేమైనా కుక్క స్కేట్‌బోర్డు ఎక్క‌డ‌మే గ్రేట్ అనుకుంటే ఇలా ప‌రుగులు తీయడం గ్రేట్ క‌దా!

 

   


logo