శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 20, 2020 , 17:54:56

కుక్క ఎంట్రీతో నిజం తెలిసిపోయింది..

కుక్క ఎంట్రీతో నిజం తెలిసిపోయింది..

ఫన్నీ వీడియో.. కుక్క‌లు దొంగ‌ల‌ను ప‌ట్టించ‌డ‌మే కాదు. ఇలా వ్యాయామం చేస్తున్నామంటూ డూప్ కొట్టేవారిని కూడా ప‌ట్టిస్తుంది. ఇంత‌కీ ఏమైంది అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

 ఒక అమ్మాయి కాళ్లు పైకి, తల కిందకు చేసి హ్యాండ్‌స్టాండ్ చేస్తూ ఉన్నట్టు లేదు. పక్కనే ఓ పెద్ద మనిషి న్యూస్‌ పేపర్‌ చదువుతున్నట్లు ఉంది కదా.. వాస్తవానికి అతను కూర్చుని చదవట్లేదు. పడుకుని చదువుతున్నాడు. అంటే ఆ అమ్మాయి కూడా వెల్లకిలా పడుకుని కాళ్లు పైకి కిందకు ఊపుతున్నది. వీడియో చివరివరకు చూస్తే అర్థమవుతుంది. చివర్లో ఓ కుక్క  వీరిద్ద‌రి మ‌ధ్య‌లోకి చ్చింది చూడండి. కుక్క ఎంట్రీతో నిజం తెలిసిపోయింది. కుక్క మామూలుగా నడుచెకుంటూ వచ్చేదాకా వారి ఫేక్‌ ట్రిక్స్‌ గుర్తుపట్టలేము. జస్ట్‌ ఇదో ఫన్నీ వీడియో.  

ఈ వీడియోని ఫేస్‌బుక్ యూజ‌ర్ పాలిన్హో మార్టిన్స్ పోస్ట్ చేశాడు. స్టార్టింగ్ వీడియో చూసిన వారు నిజం అని న‌మ్మ‌క త‌ప్ప‌దు. అంత‌లా ఉంటుంది. అందుకే ఈ క్లిప్‌ను 5.4 మిలియ‌న్ల మంది వీక్షించారు. 2 ల‌క్ష‌ల‌కు పైగా షేర్ చేశారు. 10 వేల‌కు పైగా రీట్వీట్ చేశారు.


logo